Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మొన్నటిదాకా, నేటికీ కూడా !!
యుద్ధమే !!..
యుద్ధం యుద్ధం యుద్ధం
రోజూ ఓడిపోతున్నాం
పాలిపోతున్నాం
ఎల్సిపోతున్నాం,
ఎక్కిరించే నవ్వులకు
సుట్టాల మాటలకు
ఇరుగు పొరుగు సూపులకు..
మొకం కళ తప్పింది
అచ్చం ఎండుక పోయినా చెరువు లెక్కనే
ఏడు పూతలు రాలిన చింత లెక్కనే
మోడుగా మిగిలింది, ఘోల్లుమంది,
అరికాలును చీల్చిన సర్కారు ముళ్లు లాగనే
కలలను చీల్చుతోంది..
అయ్యవ్వల ఒంటిపై పారే చెమట నదిని
కండ్లల్ల నీరు పారించే కారం ముద్దను
వాసాలను ముద్దాడే వాన సుక్కలను
పొయ్యి కాడ ఎక్కిరించే ఎసరు సర్వలను
చూసి చూసి చూసి,
కలం పట్టినం, స్టడీ చైర్లకు కు బంధిమయ్యాం
వొయ్యిల తోటి స్నేహం జేసినం,
కలలకు రంగులద్దుకున్నామని
సింగిడి మా చుట్టమే అని
సిరి ఏటిల ఇంట్ల పారుతదని
ఆ రాత్రి నిబ్బరంగా,
నిద్రను మరిచిన కంటికి, నిద్రబుచ్చాము..
నిండిన చెరువుకు గండి పడ్డట్టు
గాలి దుమరానికి మాను ఒరిగినట్టు
మెదులు తెగి నారి మడి నీళ్ళోట్టినట్టు
కండ్ల లొట్టల్లో నీళ్ళు ఎండుకపోయినరు
అందంగా రాసుకొని పూసుకొని ఊహించుకున్న
భవిత మీద బరాలు పెట్టీ పేల్చినట్టయింది,
లీక్ లీక్ బ్రేకింగ్ న్యూస్ హార్ట్ బ్రేక్ అయింది..
పిడికిలి ఎత్తుదామంటే సత్తువ లేదు,
నిద్రలేని రాత్రులు
పస్తులున్న పొట్టలు
ఖాళీ ఉన్న జోబులు
పొక్కలు బడ్డ చెప్పులు
ఇంకిపోయిన పెన్నులు
కలలతో మాట్లాడిన క్షణాలు
మీటింగ్ పెట్టుకున్నాయి..
పగటి వేషగాళ్ళ మాటల్ని ు.V ల్లో వింటూ
ఒక్కసారి కండ్లను మూస్తే
వేడి వేడిగా ఒక చుక్క చెంపను తడిమింది
దారి కట్టిన చుక్కల్ని ఆపటం మా తరం కాలేదు
గుబులు తరంగాలు తన్నుకొస్తుంటే కంటి కొసలు తెగి, వేళ్ళ కొసలను తాకుతూ తాకుతూ మౌనంగా రాలుతున్నాయి..
కాసులకు,
లీకుల కాకులు, నాసు బెట్టి
మా పొట్ట గొట్టి
ు.V ల్లో డిబెట్లు పెట్టీ
నిందను వానికి వీనికి పూసుకుంట
మీరు సుద్ద పూసలంటే
మేం నమ్ముతామా !??
బతుకుల మీద బండ గొట్టిన, మీకు
అదే బండ చరిత్రను లీకైన పేపర్ లాగే మీకు అందిస్తాం...
ఖబడ్దార్ !!
- మహేష్ వేల్పుల, 9951879504