Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కవి రాయలేని కావ్యం
వర్ణనతో చూపలేని భావం
దైవత్వం కలబోసిన రూపం
ప్రేమామృతాన్ని పంచేతత్వం
అమ్మంటే ఓ దైవం
సృష్టికే పరమార్థం!!..
రక్తాన్ని పంచిన దైవం
బిడ్డ ఆనందమే తన తీరం
పిల్లల క్షేమమే తన స్మరణం
నీడై కాచెను ప్రతి తరుణం
అమ్మంటే ఓ దైవం
సృష్టికే పరమార్థం!!..
సమిధై రగిలేను నిరంతరం
బిడ్డ ఎదుగుదలే తన హృదయాంతర సంబరం
మాతృమూర్తి ప్రేమే విశ్వంతరం
తానే ఈ జగముకు సర్వాంతరం
అమ్మంటే ఓ దైవం
సృష్టి పరమార్థం!!
- గుండా జగదీశ్
(మాతృ దినోత్సవ శుభాకాంక్షలు...)