Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేను కవిని కాను
నా ఆలోచనలకు విడిది
నవ రంజిత కవనం కాదు
నయవంచిత జీవనం......
నేను కవిని కాను
నా కలం వెలువరించేది
నల్లని సిరాక్షరావళి కాదు
పల్లవించే రుధిర సాక్షావళి......
నేను కవిని కాను
తెల్లని కాగితంపై చెల్లని అక్షరాలను సొగసుగా పరువలేను
పీడిత జన మనోక్షేత్రంలో విప్లవాక్షరాలను గడుసుగా
పొదవగలను.....
నేను కవిని కాను
నా కలంలో ప్రవహించేది చప్పటి సిరా చుక్క కాదు
నేలకొరిగిన వీరుల పౌరుష నెత్తుటి ధార......
నేను కవిని కాను
నా చేతులు నా గమనంలో ఎదురొచ్చినా ప్రియురాలి
నడుమును తాకలేదు
గమ్యం చేరాక
ఎదురు నిలిచిన వీరుల
చేతి కొడవళ్ళను ముద్దాడాయి.........!!!
- ఎం. కురుమయ్య యాదవ్
7799553493