Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాకుల రొదలా ఉంది
కోయిల గాన కోమలత్వం ఏమయిందో
పరిమళాలు వెదజల్లాల్సిన పూదోటలో
ఏదో గంజాయి వాసన ప్రమాదం పొంచి ఉంది
మల్ల్లెతీగలన్ని ముళ్లపొదలుగా
పారిజాతాలన్ని పల్లేరులుగా మారుతున్నాయ
మానవులు తయారవ్వాల్సిన ఫ్యాక్టరీలో
ఎందుకో మారణాయుధాలు తయారవుతున్నాయి
మాలతీ లతలు పందిరినెక్కడానికి
ఎందుకో భయపడుతున్నాయి
పందిరి మాటున పొంచి ఉన్న
పైశాచికత్వం గుర్తించింది కాబోలు
గులాబీలు తుమ్మముల్లను
అరువు తెచ్చుకుంటున్నాయి
ఆత్మ పరిరక్షణ కోసం
అవలంబించాలి యుద్ధనీతి
దీపంలా వెలగాల్సిన ఇల్లు
చితిమంటల్లో చిక్కుకుంది
ఆఖరి పుల్ల వేస్తూ ఆజ్యం పోస్తూ
నిప్పును రాజేసే కుటిలత్వం నీడలో
మంచుకొండలా చల్లగా ఉండాల్సిన మనిషితనం
ఎందుకనో లావాలా జ్వలిస్తుంది
నేనెందుకనో గడ్డకట్టుక పోతున్నాను
రేపెప్పుడైనా అగ్నిపర్వతంలా జ్వలించి
లావాలా స్రవించాలి కాబోలు
- బి.అంజనీ దేవి, 9908962730