Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గీ..ఎస్పీలకేమయిందో...! ఎస్పీ అంటే సూపరింటెం డెంట్ ఆఫ్ పోలీసు కాదండోయి. గదే విశారదన్ మహారాజ్..ధర్మసమాజ్ పార్టీ(డీఎస్పీ), ఆర్.ప్రవీణ్ కుమార్(ఆర్ఎస్పీ)... బీఎస్పీ.. మంద కృష్ణమాదిగ.. మహాజన సోషలిస్టు పార్టీ(ఎంఎస్పీ). గీటికేముంది కానీకే అనుకుంటున్నారా? పొద్దుల్నేస్తే మూలవాసుల గురించి మాట్లాడే విశారదన్..ఆయన పెట్టిన సభలో ఒక్క మాటా బీజేపీని అనలేదు. మూలవాసుల ఉనికినే లేకుండా చేస్తున్న ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని అమలు చేస్తున్న బీజేపీని విమర్శించలేదంటే ఆయన పోరాటం ఎవరిమీదనో? ఇక బీఎస్పీ అయితే బీజేపీ ప్రస్తావనే తీయలేదు..ఉత్తర భారతంలో ఆ పార్టీ దళిత మహిళలను చెరబట్టి, యువకులను త్రిశూలాలతో కొట్టి చంపుతున్నది. అయినా ఆ ప్రాంతం నుంచొచ్చిన మాయవతక్క నోటి నుంచి ఆ మాటే రాలేదు మరీ! ముచ్చటగా మూడో ఎస్పీ..మన ఎంఎస్పీ. కృష్ణమాదిగ పార్టీ. ఈయనగారైతే ఏకంగా కర్నాటక ఎన్నికల్లో బీజేపీ తరుపునే ప్రచారం చేశారు. అది రిజర్వేషన్లు ఇస్తామని జెప్పి విస్మరించిన పార్టీ, దళితులను అడుగడుగునా అణిచేస్తున్న పార్టీ, ఏకంగా రాజ్యాంగాన్నే మార్చాలం టున్న పార్టీని పల్లెత్తు మాటా అనలేదంటే ఎవరికోసం పనిచేస్తున్నారో? మరీ! గీ ముగ్గురి ఎస్పీలను చూసీ దళితు లంతా ముక్కునేలేసు కుంటున్నారు. మా గురించి ఏర్పడిన పార్టీలకు ఏమయిందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
- నిరంజన్ కొప్పు