Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ విముక్తి కోసం
పద్యమే ఆయుధమై నిలిచిన
ఉద్యమ సారథి దాశరథి
కమ్మూనిష్టు ఉద్యమ భావాల కూడలి
నిజాం అరాచక ప్రభుత్వ
ఉద్యమ కారుడు
పీడిత ప్రజల గొంతుకయై
రైతు పక్షపాతిగా నిలిచి
నిజాం గద్దె దిగిపోవాలనే పిలుపుతో
భావి ప్రేరిత ఊరూరా ప్రసంగాలతో
సాంస్కృతిక చైతన్యానికి
నాంది పలికిన గొప్ప ఉపన్యాసకుడు
పొలాలు దున్నె రైతు రాజని
పొలిమేర పిలిస్తే తల్లికి ఆనందమని
నిజామొక పిశాచియని
ధనవంతుల భూస్వాముల
దౌర్జన్యం సాగ నివ్వద్దని
గాయపడిన కవి గుండె గాయం
హృదయ వేదన
కవిత్వం ద్వారా తెలిపిన
తెలుగు వెలుగుల అక్షర కెరటం
తెలుగు జాతి ఖ్యాతిని మిగిల్చి
సినీ సాహిత్య గీత రచనలతో
మైమరపించిన మధుర కవి
తెలంగాణ ఉత్తేజిత గీతాల
అభ్యుదయ కవితా చక్రవర్తి
తెలంగాణ కోటి రతనాల వీణ గా
మెరవాలని కాంక్షించిన కృష్ణమాచార్య
ఆలూరి విల్సన్
ఊరు: నల్లగొండ
చరవాణి:9396610766
ఈ-మెయిల్: [email protected]