Authorization
Mon May 05, 2025 10:02:26 am
విధిబడినుండి విశ్వంభరుడై
జగతితో జగదేకవీరుడయ్యిండు
నిత్యపాఠమువలె సత్యపీఠికలు
కొత్తకవులకు నిత్యబాటవేసిండు
చింధుబాగోతం పొందుపర్చుకొని
ఒగ్గుకథలువిని నిగ్గుతేలాడు
సాహిత్యమేనాకు సర్వమన్నాడు
విశ్వనాధుడై విహరించినాడు
కర్పూరవసంతరాయుడై నిలిచి
భూగోళమంతా కలిసితిరిగిండు
పద్మభూషణ్ తో పరిణతిచెంది
రాజ్యసభలో రాజు అయ్యిండు
దొరసానిపాటతో మనసుదోచుకొని
జేజమ్మపాటతో జెజెలుపొందిండు
గజల్స్ వ్రాసి గళమెత్తి పాడి
జ్ఞానపీఠంతోటి గగనమెక్కిండు
- వాకిటి రామ్ రెడ్డి
పులిగిల్ల ,వలిగొండ ,యదాద్రి భువనగిరి జిల్లా.
చరవాణి : 9000702093