Authorization
Mon May 05, 2025 02:10:50 pm
అతడొక అగ్నిపర్వతం
అరాచకపు చీకట్లలో పడి మగ్గుతున్న
తెలంగాణ నేలను
వెచ్చని అక్షరాల వెలుతురుతో తడిమాడు
కలం వేళ్ళతో దోపిడీల కీళ్ళు విరిచి
కోటి రతనాల వీణను మీటాడు
అనాదిగా న్యాయానికి జరుగుతున్న
అన్యాయాన్ని చూసి సహించలేక
ఉద్యమాన్ని ఊపిరిగా చేసుకుని ఉరకలెత్తినవాడు
సినీ హనీ పాటలతో అందరి
మనసుల్ని దోచినవాడు
ఆలోచనాలోచనాల లోతులు చూసినవాడు
మేల్కొన్న స్వప్నానికి, రగుల్కొన్న ఆశయానికి
సజీవసాక్ష్యమతడు.
అక్షరాలతో అగ్నికణాలతో
ఆధునిక తెలుగు కవిత్వానికి కట్టిన వారధి
మహాకవి దాశరథి.
-- తిరునగరి శరత్ చంద్ర
6309873682