Authorization
Sun May 04, 2025 07:34:59 pm
జన్మనిచ్చే ఒక సామాన్య బాలుడికి సిరిసిల్ల
కీర్తించే నేడు వారిని చూసి జగమెల్ల
సకల ఆధ్యాయాలను ఆకళింపు చేసుకున్న ప్రయోగశీలి
వివిధ సాహిత్య ప్రక్రియలను తన కలంలో నింపుకున్న ధీరశాలి
శబ్దశక్తిని తన ఆయుధంగా మార్చుకొని పేరొందిన వక్త
సమస్త భాషలు తన నాలుకపై నాట్యమాడించిన బహుభాషావేత్త
మానవతా విలువలను తెలియజేసిన ప్రముఖకవి
కవులసమూహంలో వారిది ఒక గొప్ప ఠీవి
గొప్ప కావ్యంగా నిలిచే ప్రజలగుండెల్లో విశ్వంభర
కొత్త రంగులద్దుకుంది మీ పాటల సవ్వడితో సినిమా తెర
మనుషుల మనస్సులలో నిత్యం గుర్తుండిపోయే నారాయణుడు
నేటి సమాజ హితంకై కృషిచేసిన మహానుభావుడు
తన సొంతమయ్యింది సాహితీ పురస్కారం జ్ఞానపీఠము
చిరస్థాయిగా నిలిచిపోయిన, వారు తెలంగాణప్రజల గీతము
అందుకున్నాడు భారత అత్యున్నత పురస్కారం పద్మభూషణ్
విమర్శకులందరికి అప్పుడు తన గొప్పతనము తెలిసెను
మార్గదర్శకంగా నిలిచే నేడు సినారె
చరిత్ర పుటల్లో మీపేరు నిలిచిపోయే బళారే!
-- జోడు కార్తిక్
ట్రిపుల్ఐటి బాసర