Authorization
Mon May 05, 2025 11:28:30 pm
- శశికళ.బి
సీ.ప.
కానికాలము వచ్చి కష్టాల కడలిలో
నష్టాలయూబిలో నరులబాధ
చీమలూదోమలూ క్రిమికీటకాదులు
కబురులా తోడను కలసియుండు
హంసలా ఆడుతూ అలవోకనెగురుతూ
పక్షిలా ఎగిరేటి రక్షణేది?
కోపాలులేకుండ శాపాలుకాకుండ
కాపాడవయ్యా కమలనయన!
ఆ.వె
శాపకీల మాపి మాపైన దయచూపు
గూటి మాదిరయ్యె నేటి బాధ
నీది నాది యన్న వాదనే లేదులే
అందమైన లోకమవతరించు!