Authorization
Mon May 05, 2025 03:04:33 am
-శశికళ.బి
సీ.ప
చిన్నారి చిలుకలు చిరునవ్వు మొలకలు
చిత్రముగ చిన్నులే చేసినారు
కుందేలు అందాలు కోకిలా రాగాలు
నెమలికే నాట్యాలు నేర్పినారు
అపరంజి బొమ్మలూ అమృతపు జుక్కలు
అలరించ వచ్చిన అప్సరసలు
చిత్రమగు నడకలు చిరుగజ్జె రవళులు
అందమైన తెలుగు అక్షరాలు!
ఆ. వె
చల్లగాను వీచు పిల్ల తిమ్మెరవారు
పువ్వువలెను వీరు నవ్వుతారు
కరుణ జూపి నాకు వరమిచ్చె పరమాత్మ
వీడిపోవు బాధ వీరిజూడ!