Authorization
Sun May 04, 2025 06:24:38 pm
-శశికళ
సీ.ప
తొలిఝాము సమయాన తూర్పున కనిపించె
పాదాల ద్వంద్వంబు పసుపురాసి
మందారకుసుమాలు మర్థించి పారాణి
మంజీరనాదాలు మంజులముగ
చందనమున ముంచి అందాలచీరను
వరమాలచేతను కరుణతోడ
నాజూకుయనిపించె నడుము వడ్డాణము
నగిషీలు జెక్కిరి నగలపైన!
ఆ.వె
వీణ మీటసాగె వీనుల విందుగా
చదువసాగుచుండె శాస్త్రములను
చేర బిలిచె నన్ను శ్వేత పద్మాసన
తలను వాల్చె నేను తనివితీర!