Authorization
Mon May 05, 2025 07:37:21 am
- శశికళ.బి
సీ. ప
అమ్మనాన్నలు లేరు ఆదుకొనిన వారు
లేరు తరతరాల తీరు మార
లేదు భార్యయు లేదు వీధిలోన బతుకు
భారమాయెబతుకు కారు చెమట
అక్క, చెల్లెలు లేరు అన్నదమ్ములు లేరు
కొడుకు కూతురు లేరు నడవలేక
వెడలు దారిలేదు వేల మైళ్ళ నడక
యాడమాయూరన్న పాడు బతుకు
ఆ. వె
ఎండ మండి పోయె యుండ నీడయెలేదు
రండియని పిలిచెడి అండలేదు
నిండు కొనిన డబ్బు తిండి గింజలు లేవు
వలవలమని యేడ్చు వలస కూలి!