Authorization
Mon May 05, 2025 03:04:33 am
---శశికళ.బి
సీ.ప
తపన చెందావమ్మ తల్లి కావాలని
ముసిముసిగను నవ్వె పసితనమున
తనలోని నలుసును కనుల జూచు వరకు
తల్లడిల్లెను కదా తల్లిమనసు
భీకర యుద్ధాన్ని బేకాతరుగ జేసి
భరియించి నావమ్మ పురిటి బాధ
బిడియాన్ని వదిలేసి ఒడిలోని బిడ్డకు
కడుపు నింపావమ్మ కన్న తల్లి!
ఆ.వె
కంటి లోన దాచి కష్టాలు కన్నీళ్లు
కడుపులోన పెట్టి కాంచె నన్ను
కొన్ని నాళ్ళు ఆగు కన్న రుణము దీర్చి
కొలుతునమ్మ నిన్ను కోరునట్లు !