Authorization
Mon May 05, 2025 02:54:15 am
-శశికళ.బి
ఆ.వె
కులము కీర్తి పెంచ కూతురై జన్మించి
అవని వెలుగు పెంచ నవతరించి
విద్య గంధమున్న విజ్ఞాన జ్యోతిని
తండ్రి వంటి వాడ తగదు నీకు!
ఆ.వె
ధరణి జాత వలన దశ కంఠుడే జచ్చె
అక్షి కోలుపోయె యక్షరాజు
సురల రాజు మేను సూది గుచ్చిన యట్లు
కన్ను దీసి వేసె కాకికపుడు!
ఆ.వె
అధరములు మెరిసెను యఱుణ శోభితముగ
నీలి కురుల దీరు నీల మణులు
వజ్ర సమముగ పలు వరుసల దీరుండె
అతిశయించి యతడినధిగమించె!
ఆ.వె
వనిత రక్ష లేని వసుధయే నిలువదు
పాప కృత్యమింక పారద్రోలు
నీతి కలుగు మాట ప్రీతిగా పలికెను
మనసు సంస్కరించు మర్మ మెరిగి!
ఆ.వె
పాశములను విడిచె పార్వతీ సేవకై
అంకితమ్ము నేను అవని ఱేడ
నేర చరిత వద్దు శూరులే మీరలు
రాచ బాట నడువు రాజ నీవు!
ఆ.వె
పకపకమని నవ్వి పరుగులెత్తెనతడు
మదము పెరుగు వారి విధము జెడును
మట్టి కరుతు నీవు మహారాజ నీవింక
ఆడుదాని యుసురు కీడు జేయు!