Authorization
Mon May 05, 2025 08:54:29 am
విప్లవ వీరుడు
ఆంగ్లేయుల ఆగడాలు
మితిమీరిన తరుణంలో
నల్లజాతీయులు తిరుగుబాటుకు
సన్నద్ధమౌతున్న సమయంలో
విరిందోక విప్లవకుసుమం
ఆయనే విప్లవయోధుడు భగతసింగ్!
పాకిస్తాన్ లో పుట్టి పెరిగినా
ఆంగ్లేయుల దురా గతాల్ని ఎండగడుతూ
భారతీయులకు బాసటగా నిలుస్తూ
రక్తానికి రక్తమే సమాదానమని సెలవిస్తూ
హింసాత్మక బాటన.పయనిస్తూ
ఉరికంబమెక్కి ఊపిరి నిలిపిన
విప్లవ సమరయోధుడు
భారతీయుల స్వేచ్చా ఆకాంక్షాపరుడు
భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు భగతసింగ్!
- ఆళ్ల నాగేశ్వరరావు
నాజారుపేట, తెనాలి
7416638824