Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆళ్ల నాగేశ్వరరావు
గుంటూరు
7416638823
[email protected]
సాగరానికి అలలు
సంసార సాగరానికి ఆటుపోట్లు
సహజం
వాటిని ఎదుర్కొని
సంసారసాగరాన్ని ఎదురీది
జీవన సంగ్రామంలో పోరాడి
విజేతలైన వయోవృద్దులు వారు!
ఆరు ప దుల వయసుపై బడిన వారికి కావలసింది
కేవలం ఆర్ధిక సాయమేకాదు
హార్ధిక సాయంకుడా కావాలి!నేటి యువకు లే రేపటి వృద్ధులు
నేటితరం వృద్ధులను నేటియువత సంరక్షిస్తే
రెపటితరం వృద్ధులను
రేపటి యువతరం రక్షిస్తుంది!
కార ణనంతరాల వలన దూరంగా ఉంటున్నప్పటికీ
వారానికోసారి ప్రత్యక్షంగా
ఓ పలకరింపుని
ఓ ఓదార్పుని
క్షేమ సమాచాల సముదాయింపుని
మీకు అండగా మేమున్నాం అన్న మనోధైర్యంను
నేటి యువత వారికందిస్టే
అంత కంటే వారు ఆశించేదేముంటుంది!
మీ విజయాలకై అహర్నిశలూ
శ్రమించిన ఆ శ్రమజీవులను
వృద్ధాశ్రమాల పాలుచేయక
అన్నివేళలా వారిని అందుకుందాం!
వృద్ధో రక్షతి రక్షిత; అనే నవ నానుడుని నిజం చేద్దాం!
భవితలో వృద్ధాశ్రమాలు లేకుండా చేద్దాం!