Authorization
Sun May 04, 2025 08:26:01 am
సీ.ప
రంగయ్య రమణమ్మ బంగారు బిడ్డడు
వెంకయ్యనాయుడు అంకురించె
రెండవ పౌరుడు నిండైన సూర్యుడు
పండువెన్నెల మోము పౌరుడితడు
మందహాసవదనమందాల చంద్రుడు
అందరీ బంధువై ఆదుకొనును
అతినిరాడంబరుడాహార్యమందున
అణగారు వర్గాల నాదుకొనును!
ఆ.వె
అధిగమించ గలరు అతివాదులనణచి
అచ్చమైన తెలుగు మచ్చు తునక
మంచితనము పెంచు పంచకట్టున ఠీవి
మానవత్వమున్న మార్గదర్శి!
ఖద్దరు ధరియించు కాంతిపుంజం
సీ.ప
అభివ్రృద్ధి పథమును ఆవిష్కరించగ
అవతార పురుషుడు ఆంధ్రుడితడు
తడబాటు లేనట్టి అడుగులు వేయును
నడయాడు చుండును బడుగు వెంట
నీరాజనాలందు తీరైన వీరుడు
భారత పీఠాన ధీరుడితడు
శతవసంతాలు వసంతుడై యేలాలి
శక్తి యుక్తి పెరిగి సాహసముగ!
ఆ.వె
ఖ్యాతి పొందినారు ఖద్దరు ధరియించి
కాంతి పుంజ మోలె కార్య దీక్ష
సిరులు కలుగ వలెను తరములు తరగక
పరిమళించు కీర్తి చరితలోన!
- బలరామమహంతి శశికళ