Authorization
Sat April 26, 2025 10:15:37 am
- అమనగంటి స్వప్న
కొలిమికుంట,కరీంనగర్
కలల వాకిళ్ళల్లో పూసిన మల్లెలు
మదిని మెరిపించే శోభితమై
ఆడపడుచుల రాక ఆ ఇంట తెచ్చునంట
వెన్నెల వెలుగై....
తంగేడు పూలతో....
గునుగు పూల వరసలో
పట్టుకుచ్చులు చేర్చి...
బంతి చేమంతులతో
బతుకమ్మ ను పేర్చి...
గుమ్మడి పూవులో గౌరమ్మను చేర్చి
మా ఇంట కొలువైన మహాలక్ష్మి నీవంటూ
పచ్చని పందిట్లో పూసిన పువ్వే నీవంటూ
పసుపు కుంకుమలతో పది కాలాలు బతుకమ్మ నీవు
బతుకునివ్వమ్మా....మాకంటూ
ఆడపడుచులంతా కూడి ఆడవచ్చే బతుకమ్మ
వెన్నెల సోయగాల ముంగిట్లో...
సందడి చేయవచ్చే కలవ భామలు
ఉయ్యాల పాటలతో సయ్యాటలు ఆడంగా
మగువ మనసు విరిసే నవ్వుల పువ్వులు
కొమ్మారెమ్మా పాటలు...ఊయల రాగాలు తీసే
బతుకంతా పండగై బతుకమ్మ పండుగ
✍️ సత్యస్వప్నం