Authorization
Sat April 26, 2025 03:23:00 am
- అయిత అనిత
8985348424
జగిత్యాల
చిగురించిన తరువులతో
ప్రకృతిమాత పరవశించిన వేళ!
హరివిల్లు రంగుల పూలతో
ధరణి పరిమళవనమైన వేళ!!
తంగేడులన్నీ కాంచనహారాలై
గౌరమ్మను అలంకరించిన వేళ!
గునుగులన్నీ వెండిపట్టీలై
బతుకమ్మ పాదాలను తొడిగినవేళ!!
పడుచుపిల్లలంతా కోలాటాలతో
కోలాహలమే చేసిన వేళ!
ముత్తైదువులంతా మురిపెంగా
చప్పట్ల తాళమేసిన వేళ!!
వీధులనిండా పూలపరిమళమే
పరుచుకున్న వేళ!
సమిలిముద్దలన్నీ ఘుమఘుమలతో
కొలువుదీరిన వేళ!!
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బంగారు బతుకమ్మ ఉయ్యాలో
అంటూ పాటలదండోరా
మారుమ్రోగిన వేళ!
గొల్లవారి వాడలకు కోల్
ఎందుకొచ్చినావు కృష్ణా కోల్
అంటూ కోలలు సయ్యాటలాడిన వేళ!
పూలజాతరను జూసి పులకించిన మాఊరు
బతుకమ్మ వైభవాన్ని గాంచిన మా ఊరు