Authorization
Sat April 26, 2025 04:55:46 am
- గాజుల భారతి శ్రీనివాస్
ఖమ్మం, 9849788108
ఇది నవయుగమా
నవీన యుగమా
కాదు..కాదు
పాపం పెల్లుబికే పాపపుయుగం
మనిషిగా
మాయమౌతున్న
మాఁనవఁమృగాళ్ల యుగం
మదపుటేనుగుళ్ల
అచ్చోసిన ఆబోతుళ్ళ
రంకెలేస్తూ
ముక్కుపచ్చలారని అన్నెం,పున్నెం తెలీని
పసికూనలపై..
కామక్రీడా కేళీలో కరాళా నృత్యం చేస్తున్నారు
కనుమరుగౌతున్న మనిషి జాడకోసం
ఆక్రోశిస్తూ
ప్రతీకార జ్వాలన్ని వేదజల్లుతూ
అఘాయిత్యాల అంతం కోరుతూ
అవని అంతా నిస్సాయతగా రోధిస్తుంది
విందులు,చిందులు ఆటలో
మాదకద్రవ్యాల మత్తులో
యువత జోగుతున్నది
నిర్మానుష్యా ప్రదేశాలలో
నగర నడిబొడ్డులో
మృగాళ్ల కామవేట క్రూరత్వంలో
ఆహుతౌతున్న అబలలెందరో
మాఁనవఁమృగాళ్లు శాసిస్తున్న
మరణమృదంగాలెన్నో
వీరి కామాన్ని ఏ కాష్టంలో వేసి కాల్చాలి
ఏ భోగిమంటల్లో వేసి మసి చెయ్యాలి
నా దేశం ఏ పథం లోకి పయనిస్తోంది
ఏ లక్ష్యం,ఏ గమ్యం చేరుకోబోతున్నది??
దేవుడా..అందరూ నీ బిడ్డలే
ఒక కంట్లో కన్నీరు
మరో కంట్లో పన్నీరు
రాకుండా చూడు
కన్నతల్లులకు కడుపుకోత లేకుండా
ఆడపిల్లలను కాపాడు