Authorization
Mon April 21, 2025 04:03:45 am
- కేసమళ్ళ వెంకటయ్య
9949838702
చోళుల కాలంలో ఆరంభమైనది
ధర్మాంగుడు సత్యవతి పూజించినది
కాకతీయుల కాలంలో వృద్ధిచెందెను
రాష్ట్రపండుగగ గుర్తింపు పొందెను
ఆశ్వీయుజ శుద్ధపాడ్యమిన జరుగును
ప్రకృతి పూవ్వులతో పూజలందుకొను
తొమ్మిదిరోజులు పూజలు చేయుదురు
ఆటపాటలతో ఆనందంగ చేయుదురు
తెలంగాణ అస్తిత్వము బతుకమ్మ
మనసంస్కృతికి ప్రతీక బతుకమ్మ
అచ్చమైన తెలుగు పండుగ
ప్రకృతిని ఆరాధించే పెద్దపండుగ
శీతకాలపు మొదటిరోజులలో వస్తుంది
శిశిరానికి స్వాగతం పలుకుతుంది
తెలుగు సీమలో ఆనందము
తెలుగు లోగిళ్ళు రంగులమయము
విశ్వంలో ఎక్కడలేని పండుగ
పూవ్వులను పూజించె పండుగ
సింగిడి తలదన్నే పూవ్వులరంగులు
ప్రకృతి ఒడిలో పూసినపూవ్వులు
తొమ్మిదిరోజులు జరుపుకునె పండుగ
నిమజ్జనంతో ముగుయును పండుగ
చివరిరోజున బతకమ్మను సాగనంపుదురు
బతుకమ్మను మల్లిరమ్మని వేడుకుందురు