Authorization
Sat April 26, 2025 12:51:38 am
భారతదేశం ఇది స్త్రీలకు యమలోకం ఇది
కనకండి పెంచకండి ఆడపిల్లల్ని
కానీ పెంచి దురహంకారులకు
ఆహారము చేయకండి
దేశములో ఎదురులేని యాటగాళ్లు ఉన్నారు
లేడి పిల్లలను ఎందరినో వేటాడి చంపుతున్నారు
భారతమ్మను కాపాడే జవాన్లు ఉన్నారు
దేశానికి విలువైన శాస్త్రవేత్తలు ఉన్నారు
చరిత్రను తిరగ రాసే వ్యాసకర్తలు ఉన్నారు
చంద్రుణ్ణి తాగొచ్చిన భారతీయులు ఉన్నారు
పకృతిని పలకరించే కవులెందరో ఉన్నారు
రాష్ట్రాలను కాపాడే రాజులు ఎందరో ఉన్నారు
దేశాన్ని కాపాడే దేశ గురువులు ఉన్నారు
ఎందరు అంటే ఏంటి ..?
ఎందరు ఉంటే ఏంటి
ఆడపిల్లలకు రక్షణ లేని అంధకారం ఈ భారతదేశం
అందరూ కోమట్లే కోడి పిల్లలు ఎట్లా పాయె
- తోట్లవెంకటలక్ష్మి, మహబూబాబాద్ జిల్లా