Authorization
Mon April 14, 2025 07:32:27 am
ఆ నలుగురినైనా
సంపాదించక పోతే...
రేపు నీ శవాన్ని ఎవరుమోస్తారు??
అంటుంటారు కొందరు!!...
ఇప్పుడు మోసేకాలం పోయింది!!
ఓ యాత్ర శవయాత్ర రథంలో...
భగవద్గీత శ్లోకాలతో ఊరేగుతోంది!!
నిజమే!! చనిపోయినాక
ఎవరుమోసేది? ఎక్కడ పెట్టేది?
ఎవరికి ఎరుక?
ఎరుకతోఉంటున్నప్పుడే...
అన్నీయేరుక!!....
ఎరుకచేసే చిలుక
ఏరు దాటితే..ఇక ఇంకేమి?శవమే!!...
అన్ని జ్ఞాపకాల్ని వలిచి..
అన్ని అనుభూతులను విడిచి...
తలవని తలంపుతో సాగిపోవడమే!!...
అన్నీ తుంచేసుకొని...
అన్ని బంధాల్ని తెంచేసుకొని...
మొదట వచ్చినట్లుగానే...
సహజంగానే సాగిపోవడం!!...
ఈలోకంలో...
ఎవరూ ఉండడానికి రాలేదు!!...
బతుకడానికి వలసవెళ్లిన్నట్లు...
మరో కొత్తజన్మ కొరకు...
లోకాన్ని విడిచి వలసపోవడమే!!...
ఈ వలస బతుకేంటి అనుకుంటారు...
ఈలోకంలో ఎవరికి వారు!!...
సుఖదుఃఖాల్ని
అనుభవించుకుంటూ...
బంధాల్ని
అనుబంధాల్ని ఏర్పరచుకొని...
తప్పుల్ని ఒప్పుల్ని
తనపొత్తిళ్లలో నింపుకొంటారు!!...
బొందిలోని చిలుక
కొత్తఎరుక కోసం
ఎవరికీ చెప్పకుండానే
వలస వెళ్లుతోంది!!...
నిశ్శబ్దంగా..స్వచ్చంగా..ఎవరికీ
అగుపించకుండా జారుతోంది!!...
తనువును వదలి..మన్నును విడిచి
మిన్నుకు ఎగిరిపోతోంది!!...
తనకుతానై..తనలోవుంటూ...
ప్రతి తనువునుతట్టి
తనకు తాను ఓ కొత్త రూపం చెక్కుకొని..
వింతపోకడలను వదులుకొని...
ఇన్నునుంచి మిన్నుకు వస్తోంది!!...
అన్నిటినీ ఛేదించుకొని...
ఓ పద్మవ్యహము లాంటి
అన్ని సమస్యలను వదలి వెళ్లుతోంది!!..
తిరిగిరావడం ఏదో జన్మతో వస్తోంది!!..
కొత్త బతుకుతో వస్తుంది!!...
నిన్నలో జీవించిన జీవి...
నేడు లో జ్వలించి జయించి
జాగ్రత్తగా వెళ్లిపోతుంది...
అవని దిగంతాలలోకి
విహరించే విశ్వవిజేతగా
వెళ్లి పోతోంది!!....
అంబటి నారాయణ
నిర్మల్
9849326801