Authorization
Mon April 14, 2025 11:54:12 am
ఆడపిల్ల పుడితే
' ఆడ' పిల్లేగా అంటూ
ఆర్ధికంగా భారమంటూ
భూమి మీదకు రానికుండా
భృణహత్యలకు పాల్పడే
హాంతకులున్న నేటి సమాజం
మారడం అసాధ్యం!
ఆడపిల్ల పుడితే మైనస్ అని
మగపిల్లాడు పుడితే ప్లస్ అని
లెక్కలు కట్టే నేటి తరుణంలో...
మీ ముందు తరం కూడా మీలా భావిస్తే
ఆడపిల్లల జననం జరిగేదా?!
సృష్టి ఆగకుండా సాగేదా?!
ఆడపిల్ల పుడితే
మహాలక్ష్మి పుట్టిందంటూ
ఆనాడు పండుగ చేసుకోబట్టే
ఈనాడు మగపుంగవులు
బతికి బట్టకడుతున్నారు!
రెండు కళ్ళతో చూస్తేనే
చూసే చూపు సరిగా వుంటుంది
సూర్యుని కిరణాలన్ని ప్రసరిస్తేనే
చంద్రుడు వెన్నెలనిచ్చేది!
బాలికలకు ప్రోత్సాహాన్ని అందిస్తే
బాలురతో పాటు సమంగా
ఆటపాటల్లో
ప్రతిభాపాఠవాల్లో
తమ ప్రతిభను నిరూపించుకుంటారు
కుటుంబ గౌరవంతో పాటు
దేశ ప్రతిష్టను పెంచుతారు!
ఆశ శిశువుల జననాన్ని
పురిటీలోనే పుట్టకుండా ఆపితే...
ఆడవారి సంఖ్య తరిగి
పెండ్లి చేసుకునేందుకు
వధువుల కొరత ఏర్పడి
మళ్ళీ ఆనాటి కన్యాశుల్కం
పునరావృతమోతుంది!
ఇంటికి దీపం ఇల్లాలైతే
ఆ ఇల్లాలికి ప్రతిరూపాలు
పుట్టే బాలికలు!
ఆ వాస్తవాల్ని గ్రహించి
ఇంటి దీపాల్ని వెలిగించుకుందాం
బాలికల శిశు సంరక్షణకు
నడుం బిగిద్దాం!
- ఆళ్ల నాగేశ్వరరావు
7416638823