Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విశ్వవ్యాప్త సంప్రదాయ సంస్కృతికి నిలయం తెలుగు భాష
అమ్మ పిలుపుల ఆత్మీయత మధుర పదముల
తేనె లొలుకు తీయని
స్వర జీవ భాష
మనసు కదిలించు పవిత్ర జీవ ప్రాణాక్షరం
మహా భారత రచన నన్నయ్య తిక్కన్న ఎర్రన
ప్రతిభా శైలికి పునాది తెలుగుభాష గురజాడ ,జాషువా
రచనలో మెరుపులా మెరిసిన స్వచ్చమైన తెలుగుభాష
అమృతము కురిపించగ దివినుండి భువి కేగిన దివ్యభాష తెలుగు భాష
త్యాగయ్య గొంతులో తారాడిన నాదము తెలుగు భాష
గ్రాంధికమై వ్యావహారికమై అపురూప నెమలి
అంద చందాల తెలుగు భాష
తెలుగు అక్షరముల అతి దీప్తి రమ్యముల
కవిత్వ రూపాంతర తెలుగు భాష
పాఠ్య గ్రంధమున గ్రాంధికమై జాన పదమున వ్యావహారికమై
మేఘముల మెరుపు తీగవలె నవ్య పదకేళి
ప్రభవించు మేలిమైన తెలుగు భాష
కృష్టరాయలచే కీర్తింపబడిన అపురూప
అంద చందముల
ముత్యముల ముదు ముద్దు తెలుగు భాష
అన్ని భాషల కన్న తీయనైన తెలుగు భాష మనది
తెలుగు ఖ్యాతి మనది
- డా.ఆలూరి విల్సన్
9396610766
[email protected]