Authorization
Mon April 14, 2025 07:14:28 am
ఈ కథ
చదువుతుంటే నాకు
కన్నీళ్లు వస్తున్నాయి!!...
ఆర్ద్రతతో గుండె పొంగి
ఆవేదనతో నిండిపోయింది!!..
ఎదలోతుల్లో మెదిలే
మానవత్వపు తడిఅలలా
మనసు విలవిలాడుతోంది!!...
పొంగే కన్నీళ్లు సెగలై
బయటికి వస్తున్నాయి!!...
గాయపడ్డ గుండె ఎందుకో
గాబరా పడుతోంది!!...
తెలియని ఆరాటమేదో
నన్ను ఆవహిస్తోంది!!...
ఈ కథ అంతరాత్మలో
ఏదో నిరంతరం జరిగిన
పోరాటపటిమ దాగివుండిందేమో!!
తెలియని ఆరాటమేదో
తెగువతో సాగింది!!...
కథంతా రక్త చందనమే!!...
కత్తుల కవాతు జరుగుతోంది!!...
కొందరి ముఖాలలో కదలాడే కసి
కొందరి జీవితాలను
సమాధి చేశాయి!!...
బతుకు జెండాను నిలబెట్టుటకు
ఉవ్వెత్తున కెరటమై లేచిండ్రు!!...
ఉక్కు పిడికిలితో రణం చేసిండ్రు!!...
ఈకథను ఎవరికి వారు
అన్వయించుకోవాలి!!...
అనుక్షణం అనుభవించిన
జీవనగాథ కనబడుతోంది!!...
కుంగిపోయిన వైనం...
తెగిపోయిన జీవన స్థితిగతులు...
ఒరిగిపోయిన ధైర్యశిఖరం...
రగిలే కడుపుమంటలు...
తిరుగబడిన కాలం
కనబడుతోంది!!...
కొందరి పెద్దరికపు
పెత్తనం అగుపిస్తోంది!!...
కాలంతో సాగిన పరుగు పందెంలో
జీవనరథ చక్రాల క్రింద
నలిగిన వారెందరో!!??...
వ్యక్తిత్వంతోపాటు...
అస్తిత్వాన్ని కాపాడుటకోసం...
ధిక్కార స్వరంతో...
ఉద్యమ సెగల పొగలతో...
కొత్తగా ఎరుపెక్కిన
జెండాను ఎగిరేసిండ్రు!!....
కవి కాంచిన చోటంత వాస్తవ దృశ్యమే!!..
ఓ సజీవ చిత్రంతో కథకు ప్రాణం పోసిండు!!..
- అంబటి నారాయణ
నిర్మల్
9849326801