Authorization
Mon April 07, 2025 05:04:23 am
నూతన ఉత్సాహలకు నాంది
చైత్రశుద్ధ పాడ్యమి నాడు ఉగాది
నక్షత ఆగమనమే ఉగాది
వసంత ఋతువులో కోయిల రాగాలు
కొత్త పూత,కాత తో పరిమళం
లేలేత చిగురుల తో ప్రకృతి పరవశం
తైలాభ్యంగనం, నూతన వస్త్రాధారణ
కొత్త పదార్థాల సమపాళ్లతో
ఆరు రుచులతో పచ్చడి చేసి
దైవానికి నైవేద్యం సమర్పించి
షడ్రుచులను జీవితానికి అన్వయించుకొని
ఒక ప్రాణాళికను అలవర్చుకోనే రోజు
సంవత్సరాన్ని లెక్కించే రోజు
పంచాంగ శ్రవణం చెప్పే రోజు
తెలుగు వారి ఉగాది పచ్చడి
ఆరోగ్యాన్ని పెంచే అమ్మ ఒడి
కష్టసుఖాల కూడలి జీవితమని
చేదు మధురములతో పచ్చడి చెప్పెను
- కాలై కవితసుభాష్
కామారెడ్డి జిల్లా కౌలాస్ గ్రామం
చరవాణి: 6281950150