Authorization
Mon May 05, 2025 11:48:35 am
2023లో యూరోప్‌లోని ఇంగ్లాండ్, ఇటలీ, న్యూజిలాండ్ దేశాల్లో అంతర్జాతీయంగా నిర్వహించనున్న సాహిత్య వారోత్స వాల్లో ప్రతీ దేశం నుండీ (అన్ని భాషలూ కలిపి) ఒక కవినీ, ఒక కథకుడినీ, ఒక విమర్శకుడినీ ఎంపిక చేయనున్నారు. వారిని ఆ దేశ ప్రతినిధులుగా, అంటే ఒక్కో దేశం నుంచి ముగ్గురు ప్రతి నిధులను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తారు. ఇందుకోసం చేయాల్సింది... మీ రచనల్లోని మూడు ఉత్తమమైన రచనల్ని (అచ్చయినవైనా) పంపించాలి. అలా వచ్చిన వాటి నుంచి ఎవరివి ఉత్తమంగా ఉంటే, వారిని ప్రతినిధులుగా ఎంపిక చేస్తారు. వారు బయలు దేరిన దగ్గర నుంచి తిరిగి స్వదేశానికి చేరే వరకు భోజనం, వసతి, ప్రయాణ ఖర్చులు నిర్వాహకులే భరిస్తారు. ఆసక్తి కలిగినవారు తమ రచనలను సెప్టెంబర్ 10, 2023లోగా littoday1951@gmail.com మెయిల్‌కు పంపవచ్చు.