Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : సాదత్ హసన్ మంటు కథల సంపుటి - అనార్కలి - ఆవిష్కరణ సభ ఈ నెల 16వ తేదీ గురువారం సాయంత్రం 6 గంటలకు రవీంద్ర భారతి కాన్ఫరెన్స్ హాల్లో జరుగుతుంది. అనువాదకుడు అమ్జద్‌తో పాటు పుస్తక ఆవిష్కర్త జూలూరి గౌరీశంకర్, ఏనుగు నరసింహారెడ్డి, ఏ.కె. ప్రభాకర్, కవి యాకూబ్, అబ్దుల్ వాహెద్, రాపోలు సుదర్శన్, రూప్‌కుమార్ డబ్బీకార్ సభలో ప్రసంగిస్తారు.