Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
- బీఆర్‌ఎస్ లో చేరిన బీజేపీ, కాంగ్రెస్ యువకులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై ప్రతి ఇంటా, ప్రతి గ్రామంలో చర్చించాలని రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో, బాల్కొండ నియోజకవర్గం భీంగల్ మండలం... భీంగల్, బడా భీంగల్, చేంగల్, ముచ్కూర్, బాబాపూర్, గొన్గొప్పల గ్రామాల నుంచి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన సుమారు 200 మంది యువకులు బీఆర్‌ఎస్‌లో చేరారు. మంత్రి వారికి గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల మధ్య వైషమ్యాలు, యువతలో భావోద్వేగాలు రెచ్చగొట్టే నీచ రాజకీయాలకు స్వస్తి పలకాలని కోరారు. బీజేపీ దేశ సంపదను కార్పొరేట్లకు దోచి పెడుతున్నదని విమర్శించారు. ముఖ్యమంత్రులను పని చేసుకోనివ్వకుండా దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌తోనే సమగ్రాభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు.
2జీ వేలంలో అవినీతి జరిగిందని గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆరోపించిన మోడీ 5జీ విషయంలో రూ.15 లక్షల కోట్ల మేర అవినీతి జరిగితే ఎందుకు స్పందంచడం లేదని ప్రశ్నించారు. మోడీ దోస్త్ ల కంపెనీలకు 5జి స్పెక్ట్రం అప్పనంగా కట్టబెట్టారని విమర్శించారు. దేశంలో 150 ఏండ్లకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండగా ఆస్ట్రేలియా బొగ్గును అధిక ధరలకు ఎందుకు దిగుమతి చేస్తున్నారని విమర్శించారు. అన్ని రంగాల్లో దేశాన్ని దోచుకుంటున్న బీజేపీపై ఈడీ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతుల వద్ద బీజేపీ నేతలు మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని విమర్శించారు. తడిసిన ధాన్యాన్ని కొనే బాధ్యత ప్రధాని మోడీకి లేదా అని నిలదీశారు.