Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
తెలంగాణ గీతకార్మిక సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్మెన్‌గా నియామకమైన సీనియర్ జర్నలిస్టు పల్లె రవికుమార్ గౌడ్‌ను పలువురు సీనియర్ జర్నలిస్టులు అభినందించారు. మంగళవారం హైదరాబాద్‌లోని మసాబ్‌ట్యాంక్‌లో ఉన్న సంక్షేమభవన్ కార్యాలయంలో ఆయన్ను కలిశారు. ఈ సందర్భంగా శాలువా, పుష్పగుచ్చం ఇచ్చి సత్కరించారు. అలాగే సమకాలీన అంశాలపై చర్చ కూడా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ పదవిలో ఉన్న నేపథ్యంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషిచేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు బి.బసవపున్నయ్య, గుడిగ రఘు, బి.రాజశేఖర్, దామోదర్, రామకృష్ణ పాల్గొన్నారు.