Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'యూరేకా... పండ్ల కోసం... ఇప్పుడూ వినండి 'ఉప్పుజ్ఞానం'. కోల్గేట్ టూత్‌పేస్టులో ఉప్పుంది. భయం కరమైన క్రీములు పండ్లు, చీగుళ్ల మధ్య గూడు కట్టేసుకుంటాయి. టూత్‌పేస్టులో అక్టివ్ సాల్ట్ ఫార్ములా ఉంది. వాటిని పొగొడుతుంది' అంటూ హీరోయిన్ సమంత ఉప్పుజ్ఞానాన్ని ఉషారుగా బోధిస్తుంది. ఏడాది కాలంలో పార్టీ అక్టివ్‌గా పని చేస్తుండటంతో పార్టీకి కొంత జవసత్వాలు వచ్చాయి. క్యాడర్లో కదలిక వచ్చింది. కార్యక్రమాలు పెరిగాయి. వలసలు ఆగిపోయాయి. కొంత మంది అధికార పార్టీతోనూ, మరికొంత మంది బీజేపీ నేతలతో టచ్‌లో ఉంటూ పార్టీని గందరగోళ పరుస్తున్నారు. సొంత జిల్లాల్లో పట్టు సంసాధించకపోయినా, ప్రజల అభిమానాన్ని చురగొనకపోయినా పని చేసే వారిని బదనాం చేసే కార్యక్రమాన్ని చేస్తున్నారు. గత ఎనిమిదేండ్ల కాలంలో పార్టీ అభివృద్ధి నత్తనడకలా సాగింది. పార్టీలో గెలిచిన వారు ఇతర పార్టీల్లోకి వెళ్లారు. అన్ని అపజయాలే వెంటాడుతున్నాయి. తాజాగా మునుగోడులోనూ చేదు అనుభవమే ఎదురైంది. ఇంత జరిగిన వీరిలో ఐక్యత రాకపోగా కుమ్ములాటలు మాత్రం సాగుతూనే ఉన్నాయి. వీటన్నింటి నుంచి గుణపాఠాలు నేర్చుకోవా లంటే, వారికి ఉప్పుజ్ఞానం కావాల్సిందే తాజాగా పదవులు దక్కలేదనే అసూయ, ద్వేషంతో ఊగి పోతున్నారు. ఎవరికి వారు తమకు అన్యాయం జరిగిందంటూ చిందులేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీకి పట్టిన ఈ చెదలును పొగొట్టేందుకు ఉప్పుజ్ఞానం అవసరమవుతుంది. పార్టీ ఆరోగ్యాన్ని చెడగొట్టేందుకు అనేక క్రీములు ఒక చోట చేరాయి. పార్టీని నాశనం చేస్తున్నాయి. అందులో గూడు కట్టుకుని ఉంటూ హస్తం పార్టీని తినేస్తున్నాయి. ఎన్నికల వేళ బలోపేతం కావాల్సిన పార్టీకి అక్టివ్ సాల్ట్ ఫార్మూలా అర్జెంట్‌గా కావాల్సి ఉందని అంటున్నారు ఉప్పుజ్ఞానవాదులు.
- గుడిగ రఘు