Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తొర్రూరు
ఉపాధి హామీ చట్టం నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వ చేస్తున్న కుట్ర లను తిప్పి కొట్టాలని అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ముంజంపల్లి వీరన్న అన్నారు. శుక్రవారం స్థానిక ప్రజాపంద పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపా ధి కూలీల సమస్య లపై ఈనెల 15న జిల్లా కేంద్రంలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ కూలీలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించాలని కో రుతూ కలెక్టర్ కార్యాలయం ముందు జరుగు ధర్నాను జయప్రదం చేయాలని ఆయన పిలుపు నిచ్చారు. వ్యవసాయ కూలీల వలసలను నిరోధించడానికి తీసు కొచ్చిన ఈ చట్టాన్ని క్రమంగా నిర్వీర్యపరుస్తూ పూర్తిగా రద్దు చేయడానికి కేంద్రం లోని బిజెపి ప్రభుత్వం కుట్రలు చేస్తుందన్నారు. గతంలో పనిచేసిన కూలీల వేత న బకాయిలను విడుదల చేయకపోవడం,కూలీల కార్డుకు ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ లింకు చేయాలనే నిబంధనం తీసుకురావటం తదితర సమస్యలను ప్ర భుత్వమే సృష్టిస్తుందన్నారు.పెరిగినఅన్ని రకాల ధరలను దృష్టిలో పెట్టుకొని ఒక రోజు కూలి 600 రూపాయలు ఇవ్వాలని, సంవత్సరంలో 200 రోజులు పని కల్పించాలని ఆయన కోరారు.పని ప్రదేశంలో మంచినీటి సౌకర్యం, నీడ వసతి, మెడికల్ కిట్టు అందుబాటులో ఉంచాలన్నారు.గడ్డపారలు, పారలు,తట్టలు విడి గా కొనివ్వాలని ఆయన డిమాండ్ చేశారు.కూలీల గ్రూపులలో పర్మినెంట్ గ్రూపు లని టెంపరరీ గ్రూప్లని విభజించటం, కొత్త కార్డులు ఇవ్వకపోవడం, ఒకే కార్డు పై కుటుంబాంత పని చేయాల్సి రావటం తదితర సమస్యలను వెంటనే పరిష్క రించాలని ఆయన కోరారు. గ్రామీణ ఉపాధి కూలీల సమస్యలను పరిష్కరిం చాలని రాష్ట్ర ప్రభుత్వం కోరడమే కాకుండా కేంద్రంపై గట్టిగా ఒత్తిడి తీసుకురా వాలన్నారు.బహిరంగంగా కేంద్ర ప్రభుత్వం అంతర్గతంగా రాష్ట్ర ప్రభుత్వం మ హాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయాలని కుట్ర తో పనిచేస్తున్నాయని ఆరోపించారు.వీటిని పరిష్కరించాలని కోరుతూ ప్రగ తిశీల అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగం గా మే 15న మహబూబాబాద్ కలెక్టర్ కార్యాలయం ముందు జరుగు ఆందోళన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో చింతానవీన్, నిమ్మగడ్డ సత్యం,లకావత్ బీమా,ఎండి.రియాజ్, రవి పాల్గొన్నారు.