Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుబేదారి
హన్మకొండ, వరంగల్ సీపీఎస్ ఉద్యోగులు కర్ణాటక ఉద్యోగులకు శుభాకంక్షాలు తెలిప ిస్వీట్స్ పంచుకొన్నామని టీఎస్ సీపీఎస్సీయూ హన్మ కొండ జిల్లా అధ్యక్షుడు కందుల జీవన్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొండ శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ కర్ణాటకలోని ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని ఇప్పుడు గెలిచిన ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందని, మొదటి ప్రాధాన్యతగా ఉన్నందున పాత పెన్షన్ అమలు చేస్తామని తెలియజేయడం జరిగిందని అన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం రాజస్థాన్, చత్తీస్ఘడ్, హిమాచల్ ప్రదేశ్ నందు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తూ ఉద్యోగుల అభిమా నాన్ని పొంది, కర్ణాటకలో కూడా ఉద్యోగుల సహ కారంతో అఖండ విజయాన్ని సొంతం చేస్కో వడం జరిగింది. రాష్ట్రంలో కూడా పాత పెన్షన్ ను అమలు చేసి ఉద్యోగుల యొక్క మన్ననలు పొందాలని తెలంగాణ ఉద్యోగులు కోరుకుంటు న్నారని అన్నారు. కర్ణాటక శాసనసభ ఎన్నికల ఫలితాల్లో పాత పెన్షన్ అమలు హామీతో కాంగ్రెస్ గెలవడం పట్ల ఎన్ఎంఓపీఎస్ సెక్రెటరీ జనరల్ స్థితప్రజ్ఞ, తెలంగాణ సీపీఎస్ యూని యన్ ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, కోశాధికారి నరేష్‌గౌడ్ హర్షం ప్రకటించారు. ఆ రాష్ట్రంలో ఓపీఎస్ అమలు చేయడం ద్వారా సామాజిక భద్రత చేకూరుతుందని తెలిపారు. పాత పెన్షన్ అమలు చేస్తామంటూ మ్యానిఫె స్టోలో ప్రకటించిన పార్టీ గెలవడమనేది ఉద్యోగ, ఉపాధ్యాయ కుటుంబాల్లో ఉన్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ కొత్త విధానం పై ఉన్న వ్యతిరేకత మరో సారి నిరూపిత మైందని పేర్కొన్నారు. ఓపీఎస్ పునరు ద్ధరణ చేయకపోతే ఏ ప్రభుత్వమైనా ఇంటిదారి పట్టాల్సిందేనని పునరుద్ఘాటించారు. తెలంగాణలో కూడా పాత పెన్షన్ అమలు చేయాలని కోరుతున్నామని అన్నారు. హన్మకొండ జిల్లా అధ్యక్షుడు కందుల జీవన్ కుమార్‌యాదవ్ మాట్లాడుతూ సీపీఎస్ రద్దుచేసి తదుపరి రాష్ట్రం తెలంగాణ కావాలని ఉద్యోగులు కోరుకుంటున్నారు అని అన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొండ శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు షైక్ అప్జల్, డా.కె. వెంకటస్వామి, నున్న నర్సమ్మ జిల్లా డిపార్ట్మెంట్ ఫోరమ్ బాద్యులు తాటికొండ శ్రీనివాస్, అక్బర్, గద్దల ప్రేమలత, అడ్లూరి సరళ రాణి, బొల్లం రాజు, శాగంటి మధు పాల్గొన్నారు.