Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్
నవతెలంగాణ-వరంగల్
నేతన్నలను కాపాడుకునే జిమ్మేదారి తనదే అని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అ న్నారు. కోత్తవాడ పద్మశాలి కమ్యునిటీ హల్లో మాజీ కార్పొరేటర్,డివిజన్ ఇంచార్జ్ యేలుగం లీలావతి-సత్యనారాయణ అధ్యక్షతన చేనేత సంఘాల అద్యక్షు లు,కార్మికులతో చేనేత ఉత్పత్తులపై, ఇప్పటికే అందిన ఆర్డర్స్ తదుపరి వచ్చే పీపీ అడర్స్ పై, కార్మికుల సంక్షే మం, ప్రభుత్వం ద్వారా కార్మికులు పొందే లబ్ది,లేబర్ కార్డు అందించడంపై చర్చ సమావేశానికి ఎమ్మెల్యే హాజరైనారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అధికా రులు, కార్మికులతో కూలంకషంగా చర్చించారు. చేనేత కార్మి కులకు ప్రభుత్వం నుండి వర్తించే అన్ని రకాల పథకా లు చేనేత కార్మికులకు అందే విషయంపై కార్మికులను అడిగి తెలుసుకున్నారు.కార్మికులకు ప్రభుత్వం నుండి సబ్సిడీ ద్వారా అందించే డబ్బులను ఏ మేరకు కార్మికు లకు అందుతున్నాయని, చేనేత బీమా ప్రతి కార్మికుల కు అందే విధంగా చర్యలుచేపట్టాలని ఎమ్మెల్యే అధికా రులకు సూచించారు. చేనేత కార్మికులుగా నమోదు కానీ వారి లెక్కలు తీసి వెంటనే నమోదు చేయాలని సూచించారు .పైన తెలిపిన అంశాలపై జూన్ మొద టి వారంలో మళ్ళీ సమావేశం ఏర్పాటు చేసుకుందా మని ఆ అంశాలపై నివేదిక ఇవ్వాల్సిందిగా ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. అసెంబ్లీలో నేతన్నల కో సం తాను మాట్లాడడం జరిగిందని, సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ నేతన్నలకు భరోసా దొరుకుతుంద ని ఎమ్మెల్యే అన్నారు. నేతన్నల సమస్యల పట్ల, పరి ష్కార మార్గం చూపుతున్నామని ఎమ్మెల్యే తెలిపారు. పేద నేతన్నలకు డబల్ బెడ్ రూమ్, గృహాలక్ష్మి ఇతర పథకాల్లో ప్రాధాన్యత కల్పిస్తామని, 2100మంది నేతన్నలకు ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా నూత నంగా నిర్మించే హాస్పిటల్లో ప్రత్యేక వైద్య సదుపాయా లు చేనేత కార్మికులకు చేస్తామని, చేనేత భీమా సదు పాయం లేని పద్మశాలీలకు లేబర్ కార్డు ద్వారా బీమా సదుపాయం కల్పిస్తామని తానే డబ్బులు చెల్లించి కా ర్డు అందిస్తామన్నారు. నిరుపేదలైన లెటర్ ఆఫ్ క్రెడి ట్, సీఎంఆర్ఎస్ ద్వారా వైద్యానికి చేయూతనిస్తు న్నామని, చేనేత పెద్ద మనిషి యేలుగం వీరస్వామి విగ్రహ ఏర్పాటుకు ప్రయత్నం చేస్తామన్నారు. మెగా టెక్స్ట్ టైల్ పార్కులో మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. గతపాలకులు నేత న్నల అభివృద్ధికి ఎలాంటి చర్యలు చెప్పట్టలేదని తాను మేయర్ అయినప్పటికీ నుండి తాను ఎల్లవేళ్ళలా నేత న్నల అభ్యున్నతికి కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే తెలిపా రు. ఈ కార్యక్రమంలో యేలుగం చిన్న కొమురయ్య, కొలిపాక మదనయ్య, వెంకట మళ్ళు, శ్రీనివాస్, చిన్న భద్రయ్య, కుమారస్వామి, రాజేందర్, రమేష్, రవి రాజు, సాంబయ్య, ఓం ప్రకాష్, రమేష్, సారయ్య తదితరులు పాల్గొన్నారు.