Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గణపురం
తెలంగాణలో కర్ణాటక తరహా ఫలితాలు రావడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు రేపాక రాజేందర్ వైస్ ఎంపీపీ అశోక్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి దూడపాక శంకర్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. కేంద్రంలో మతోన్మాద శక్తులను ప్రోత్సహిస్తూ మతం పేరిట, కులం పేరిట రాజకీయం చేస్తూ పబ్బం గడుపుతున్నారన్నారు. తెలంగాణలో కూడా.ఈ తరహా ఫలితాలు వస్తాయి అన్నారు. ఈ కార్యక్రమంలో లి ప్రజా ప్రతినిధులు అన్ని గ్రామాల అధ్యక్షులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.