Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్
సమన్వయంతో సీఎంకప్ నిర్వహణ విజయవంతంచేయాలని నగర మేయర్ గుండు సుధారాణి పేర్కొన్నారు. శనివా రం ఖిలావరంగల్, వరంగల్ మండలా ల నిర్వహణ కమిటీ సభ్యులతో ప్రధాన కా ర్యాలయంలోని మేయర్ ఛాంబర్లో ఏర్పాటు చేసిన సమావేశం లో మేయర్ ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడల విజయ వంతానికి తగుసూచనలు చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ సీ ఎం కప్ నిర్వహణలో భాగంగా అథ్లెటిక్స్, ఫుట్‌బాల్, వాలీబాల్, కబడ్డీ, ఖో-ఖో వంటి 5 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనున్న నేపథ్యంలో ఖిలావరంగల్ మండ లానికి సంబంధించి ప్రభుత్వ జూనియర్ కళాశాల శంభునిపేటలో వరంగల్ మం డలానికి సంబంధించి ఓ సిటీ ఇండోర్ స్టేడియంలో ఆసక్తి గల క్రీడాకారులు తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. ఇం దుకోసం ఆయా మండల, డివిజన్ ల కా ర్పొరేటర్లు క్రీడా కారులను నమోదు చేసు కునేలా ప్రోత్సహించాలన్నారు.
క్రీడలు జరిగే క్రమంలో బల్దియా నుండి క్రీడాకారులకు కనీససౌకర్యాలు స్నాక్స్ కల్పిస్తామని. ఈనెల 15-17 వర కు మండల స్థాయిలో 22-24 వరకు జి ల్లాస్థాయిలో, 28-31 వరకు రాష్ట్రస్థా యిలో క్రీడలు నిర్వహించడం జరుగు తుందన్నారు.
ఆటల విజయవంతం కోసం విద్య వైద్య, ఆరోగ్య, పోలీస్, రెవిన్యూ, మునిసి పల్, స్పోర్ట్స్ శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి నిబద్ధతతో నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో స్పోర్ట్స్ అధికారి ఇందిరా, డిప్యూటీ కమి షనర్ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.