Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
ప్రజల్ని మభ్యపెడితే ఫలితం అనుభవించక తప్పదని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు మండ రాజన్న, మండల కార్యదర్శి నంబూరు మధు అన్నారు. ఆదివారం స్థానిక వేజేళ్ళ సైదులు రావు భవనంలో వెంకన్న అధ్యక్షతన జరిగిన పార్టీ మండల కమిటీ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని బ య్యారం పెద్ద చెరువుకు సీతారామ ప్రాజెక్టు నీటితో అనుసంధానం చేస్తామన్న రా ష్ట్ర ప్రభుత్వ హామీలు నేటికీ నెరవేరులేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇల్లందు ని యోజకవర్గంలోని రోళ్ళపాడు వద్ద బయ్యారం పెద్ద చెరువుకు మషి వాగు ద్వారా నీటిని తరలించే ప్రతిపాదనలు తయారైనట్లు కేసీఆర్ రోళ్ళపాడు ప్రాజెక్టుకు శంకు స్థాపన చేసిన సందర్భంగా హామీ ఇచ్చి ఐదు సంవత్సరాలు అయినను కార్యరూ పం దాల్చకుంట కాలయాపన చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మొన్న టికీ మొన్న గత మాజీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు బయ్యారం పెద్ద చెరువుకు సీతారామ ప్రాజెక్టు ద్వారా అనుసంధానం చేస్తే రిజ ర్వాయర్ల ఏర్పడుతుందని, దీనిద్వారా బయ్యారం, గార్ల, డోర్నకల్, ఖమ్మం జిల్లా ప్రజానీకానికి తాగు, సాగునీరు ఏర్పాట్లు జరుగుతాయని, తెలియపరచిన సంద ర్భంలో ఈ ప్రాంత ప్రజానీకాం మొత్తం అర్షద్వనాల మీద స్వాగతం పలికారు. అయినను ఇంతవరకు కార్యరూపం దాల్చలేదని, ఉన్న నీటి వనరులను సద్విని యోగం చేసే సందర్భంలో పాలకులు అలసత్యం చేస్తున్నారని వారు పేర్కొన్నారు. జిల్లా గిరిజన ప్రాంతం ఎక్కువగా ఉన్నందున ఇక్కడ ప్రభుత్వ రంగ ఉక్కు పరిశ్ర మ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని కేంద్ర ప్రభు త్వం ముందుకు రాకపోయినా రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఉక్కు పరిశ్రమ ఏర్పా టు చేస్తామని కేటీఆర్ ఇచ్చిన హామీని కచ్చితంగా అమలు పరచాల్సిన బాధ్యత బిఆర్ఎస్ ప్రభుత్వం పై ఉందని తెలిపారు. ఆయనను ఈ జిల్లా మంత్రి సత్యవతి రాథోడ్, పార్లమెంటు సభ్యులు, టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాలోత్ కవిత, జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆంగోతి బిందు, ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ ఇచ్చిన హామీలను అమలు పరచాల్సిన బాధ్యత ఉందని లేని యెడల ప్రజల మనో భావాలకు అనుగుణంగా నడుచుకోవాలని హెచ్చరించారు. రానున్న ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు పరచని యెడల ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని అన్నారు. ఈ సమావేశంలో మండల నాయకులు ఆనందరావు, నిడికొండ చంటి, వల్లాల వెంకన్న, యాకూబు, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.