నవతెలంగాణ - అనంతపురం : టీడీపీ నాయకుడు పరిటాల శ్రీరామ్‌పై కేసు నమోదైంది. బత్తలపల్లి మండలం టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి పరిటాల శ్రీరామపై పోలీసులు కేసు నమోదు చేశారు. 447, 427 సెక్షన్ల కింద పరిటాల శ్రీరామ్, మరో 23 మందిపై కేసులు నమోదు చేశారు. రెవెన్యూ అధికారులు వేసిన కొలతలను, హద్దులను పరిటాల శ్రీరామ్, మరికొందరు తొలగించారనే నెపంతో వారిపై చర్యలు తీసుకోవాలని బత్తలపల్లి పోలీసులకు తహసీల్దార్ యుగేశ్వరిదేవి ఫిర్యాదు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm