నవతెలంగాణ - ఢిల్లీ: కసాయి భర్త, భార్యాపిల్లలను అత్యంత దారుణంగా హత్య చేశారు. చివరకు తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈశాన్య ఢిల్లీ షాహదారా జిల్లాలోని జ్యోతి కాలనీలో ఈ ఘటన జరిగింది. పశ్చిమ ఢిల్లీ వినోద్ నగర్లోని ఢిల్లీ మెట్రో డిపోలో సూపర్ వైజర్ గా పనిచేస్తున్న సుశీల్ వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. మంగళవారం ఉదయం సుశీల్, అతని భార్య అనురాధ, ఆరేళ్ల కుమార్తె అదితి, కుమారుడు యువరాజ్ ను కత్తితో పొడిచారు. ఈ ఘటనలో భార్య అనురాధతో పాటు కుమార్తె అదితి తీవ్రగాయాలతో మరణించగా, కుమారుడు యువరాజ్ ను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు. హత్య, ఆత్మహత్యలకు కారణాలు తెలుసుకునే పనిలో ఉన్నారు. ఫోరెన్సిక్ టీం సంఘటన స్థలంలో ఆధారాల కోసం గాలిస్తున్నారు.