నవతెలంగాణ - బీహార్: ప్రశాంత్ కిషోర్ బీహార్‌లో జన్ సురాజ్ పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. ఎడమ కాలికి గాయం కావడతో డాక్టర్లు 15 నుంచి 20 రోజుల పాటు విశ్రాంతి తీసుకోమని సూచించారు. దీంతో పాదయాత్రను కొద్ది రోజులు పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రశాంత్ కిశోర్ వెల్లడించారు. త్వరగా కోలుకుంటే 15 రోజుల్లోనే తిరిగి జన్ సురాజ్ పాదయాత్రను ప్రారంభిస్తానని లేదంటే జూన్ 11 నుంచి మళ్లీ పాదయాత్రను తిరిగి మొదలుపెడతానని ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నాడు. తనకు మరే ఇతర ఆరోగ్య సమస్యలు లేవు అని ప్రశాంత్ కిషోర్ అన్నాడు. అధ్వానంగా ఉన్న రోడ్లపై ఎక్కువ దూరం నడవడం వల్ల కాలి కండరాలపై భారం పడి నడవడానికి ఇబ్బందిగా మారింది అని ఆయన తెలిపాడు. ఇది మానడానికి కనీసం 15 నుంచి 20 రోజుల విశ్రాంతి తీసుకోమని డాక్టర్లు వెల్లడించారు.
Mon Jan 19, 2015 06:51 pm