నవతెలంగాణ - ఉక్రెయిన్: జరుగుతున్న యుద్ధంలో రష్యా ఇద్దరు కీలక కమాండర్లను కోల్పోయింది. ఈ విషయాన్ని ఆ దేశ రక్షణ మంత్రిత్వశాఖ వెల్లడించింది. దొనెట్స్క్‌లో జరిగిన పోరాటంలో కర్నల్ వ్యాచెస్లావ్ మకరోవ్, కర్నల్ యెవ్జెనీ బ్రోవ్కో చనిపోయినట్లు పేర్కొంది. వీరు ఎక్కడ చనిపోయారు, మృతికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. వీరిలో మకరోవ్ రష్యాకు చెందిన 4వ మోటరైజ్డ్ రైఫిల్ బ్రిగేడ్‌కు నాయకత్వం వహిస్తున్నారు. దీంతో ఆయనే వ్యక్తిగతంగా యుద్ధక్షేత్రానికి వెళ్లి దాడులను పర్యవేక్షించారు. మరో కమాండర్ బ్రోవ్కో కీలకమైన మిలటరీ-పొలిటికల్ వర్క్ విభాగానికి చెందిన ఆర్మీకోర్లో డిప్యూటీ కమాండర్‌గా చేస్తున్నాడు. శత్రువుతో జరిగిన పోరులో తీవ్రంగా గాయపడి ఈయన కన్నుమూసినట్లు రష్యా పేర్కొంది. దొనెట్స్క్ ప్రాంతంలో బక్ముత్ నగరంలో కొన్ని నెలలుగా తీవ్రమైన పోరు జరుగుతోంది. ఇక్కడ రష్యా దళాలకు మద్దతుగా వాగ్నర్ ప్రైవేటు సైన్యం కూడా పనిచేస్తోంది. రష్యా దళాలు శనివారం ఒకేరోజు నాలుగు యుద్ధవిమానాలను కోల్పోయింది. ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలైన నాటి నుంచి ఈ స్థాయి నష్టాన్ని రష్యా వాయుసేన చవిచూడటం ఇదే తొలిసారి. రష్యా భూభాగంలోనే వీటిని కూల్చేసినట్లు వార్తలొస్తున్నాయి. కొన్ని వార్త సంస్థలు రెండు విమానాలు, రెండు హెలికాప్టర్లు కూలినట్లు పేర్కొంటున్నాయి. వీటిని మాస్కో ఇప్పటి వరకు ధ్రువీకరించలేదు. రష్యాలోని బ్రయాన్స్క్లో కూలిపోయిన వాటిల్లో సుఖోయ్ 34, సుఖోయ్ 35 ఫైటర్ జెట్లు, రెండు ఎంఐ-8 హెలికాప్టర్లు ఉన్నాయని రష్యాకు చెందిన ఓ మీడియా సంస్థ పేర్కొంది. వీటి కూల్చివేతలో తమ ఎయిర్ డిఫెన్స్ పాత్ర ఉందని మాత్రం ఇప్పటి వరకు ఉక్రెయిన్ వెల్లడించలేదు. కానీ, ఆ విమానాలు ఏవో సాంకేతిక సమస్యల్లో చిక్కుకొన్నాయని మాత్రం వెల్లడించింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 15 May,2023 08:14PM