నవతెలంగాణ-హైదరాబాద్ : రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు హైదరాబాద్ చేరుకుంది. ప్లే ఆఫ్ చేరుకోవాలంటే ఆర్సీబీ తన తదుపరి రెండు మ్యాచుల్లోనూ తప్పకుండా నెగ్గాల్సి ఉంటుంది. గురువారం (18న) సన్ రైజర్స్ హైదరాబాద్, 21న గుజరాత్ టైటాన్స్ తో తలపడనుంది. ప్రస్తుతం ఆర్సీబీ ఖాతాలో 6 పాయింట్లు ఉన్నాయి. తప్పక నెగ్గాల్సిన మ్యాచులు కావడంతో బెంగళూరు జట్టు అప్పుడే హైదరాబాద్ లో వాలిపోయింది. పిచ్ పరిస్థితులను మరింతగా అర్థం చేసుకునేందుకు ముందే వచ్చేసింది.
ఆర్సీబీ జట్టులో కీలక సభ్యుడైన మహమ్మద్ సిరాజ్ తన టీమ్ సభ్యులు అందరినీ కొత్తగా కట్టుకున్న ఇంటికి ఆహ్వానించాడు. దీంతో సోమవారం రాత్రి ఆర్సీబీ టీమ్ హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ లో ఉన్న మహమ్మద్ సిరాజ్ నివాసానికి చేరుకుంది. ఇందుకు సంబంధించి వీడియోని ఒక అభిమాని తన ట్విట్టర్ పేజీలో షేర్ చేశాడు. ఆర్సీబీలో కొత్తగా చేరిన కేదార్ జాదవ్ కూడా వచ్చిన వారిలో ఉన్నాడు. ఆర్సీబీ టీమ్ ను డిన్నర్ కు ఆహ్వానించినట్టు సిరాజ్ లోగడే ప్రకటించాడు. వచ్చిన బృందంలో కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సైతం ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 16 May,2023 11:10AM