నవతెలంగాణ - హైదరాబాద్
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఈ రోజు విచారణకు వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి విచారణకు రావాల్సి ఉండగా ముందస్తు కార్యక్రమాలు ఉన్నాయని ఆయన నేడు విచారణకు హాజరుకాలేనని నాలుగు రోజులు గడువు ఇవ్వాలని సీబీఐ అధికారులను ఆయన కోరారు. దీనికి సీబీఐ సానుకూలంగా స్పందిస్తూ.. అనుమతిని ఇచ్చింది. ఈక్రమంలో నాలుగు రోజులు గడువుకు అనుమతి ఇస్తునే గడువు పూర్తి అయ్యాక తప్పకుండా విచారణకు రావాల్సిందేనని సీబీఐ స్పష్టం చేస్తూ మరోసారి అవినాశ్ కు నోటీసులు జారీ చేసింది. మే 19న విచారణకు రావాలని తెలిపింది.
సీబీఐ నాలుగు రోజులు గడువు ఇవ్వటంతో ఎంపీ అవినాశ్ రెడ్డి హైదరాబాద్ నుంచి పులివెందులకు బయల్దేరి వెళ్లారు. అవినాశ్ దారి మద్యలో ఉండగానే సీబీఐ ఆయనకు వాట్సాప్ ద్వారా 19న విచారణకు హాజరుకావాలని నోటీసులు పంపించింది. హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు విచారణకు హజరుకావాలని సూచించింది. కాగా ఇప్పటికే అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణకు పలుమార్లు హాజరయ్యారు. మరోవైపు పులివెందులలో సీబీఐ బృందం భాస్కర్ రెడ్డి డ్రైవర్ నాగరాజుకు నోటీసులు అందజేసింది. వైఎస్ అవినాష్ రెడ్డికి సంబంధించిన ఈ నెల 19న విచారణకు రమ్మని నోటీసులు జారీ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 16 May,2023 05:40PM