నవతెలంగాణ - కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని పుర్బా మేదినిపూర్ జిల్లాలో మంగళవారం ఘోరం జరిగింది. ఎగ్రాలో అక్రమంగా నిర్వహిస్తున్న బాణాసంచా కర్మాగారంలో పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి 9 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాద ఘటనపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. అక్రమంగా నిర్వహిస్తున్న ఈ బాణాసంచా కర్మాగారం యజమానిని ఇటీవలే అరెస్టు చేశామని, కానీ బెయిల్‌పై బయటకు వచ్చాడని సీఎం తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm