నవతెలంగాణ-ముంబాయి: క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ పోలీసులను ఆశ్రయించారు. కొన్ని ఫేక్ యాడ్స్‌పై ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. కొన్ని యాడ్స్‌కు అనుమతి లేకుండానే తన పేరు, ఫొటో, వాయిస్‌ను వాడుతున్నారంటూ సచిన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సదరు యాడ్ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ఆయా యాడ్ సంస్థలపై ముంబైలోని వెస్ట్ రీజియన్ సైబర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. సచిన్ ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు.. గుర్తు తెలియని వ్యక్తులపై ఐపీసీ 420, 465, 500 తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఫేక్ యాడ్స్‌పై దర్యాప్తు చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm