నవతెలంగాణ-బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో ప్రజాస్వామ్యానిదే విజయమని జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తెలిపారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ అనుకూలంగా రావడంతో ఖర్గే మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికలలో అధికారం, డబ్బు ప్రభావం పని చేయలేదన్నారు. బీజేపీ దృష్టంతా కర్నాటక ఎన్నికల మీదే పెట్టిందన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి సిఎం అభ్యర్థిని అదిష్టానమే నిర్ణయిస్తుందని ఖర్గే స్పష్టం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm