నవతెలంగాణ - శాన్ఫ్రాన్సిస్కో: మరింత మెరుగైన భవిష్యత్‌ను సృష్టించాలనే ఎలాన్ మస్క్ విజన్ నుంచి తాను స్ఫూర్తి పొందానని ట్విటర్ కొత్త సీఈఓ లిండా యాకరినో అన్నారు. ఆ దిశగా సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విటర్‌ను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు. మస్క్ ఆమెను ట్విటర్ సీఈఓగా ప్రకటించిన తర్వాత లిండా చేసిన తొలి ట్వీట్ ఇదే. తనకు కొత్త ఫాలోవర్లు పెరిగినట్లు లిండా తెలిపారు. తాను ఇంకా ఎలాన్ మస్క్ అంతటి విజయవంతమైన వ్యక్తిని కాలేదని చెప్పారు. కానీ, ట్విటర్‌ను అభివృద్ధి చేయడానికి మాత్రం ఆయనతో సమానంగా కట్టుబడి ఉన్నానని పేర్కొన్నారు. ఈ క్రమంలో యూజర్ల ఫీడ్‌బ్యాక్ చాలా ముఖ్యమని తెలిపారు. ట్విటర్‌కు కొత్త సీఈఓగా లిండా యాకరినో నియమితులైన విషయం తెలిసిందే. సంస్థ అధినేత ఎలాన్ మస్క్ నుంచి ఆమె ఈ బాధ్యతలు తీసుకోనున్నారు. ప్రధానంగా ట్విటర్ వ్యాపార కార్యకలాపాలపైనే లిండా దృష్టి సారిస్తారని ట్విటర్ ద్వారా మస్క్ తెలియజేశారు. ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, సీటీఓ హోదాలో ప్రోడక్ట్ డిజైన్, కొత్త సాంకేతికతల బాధ్యతలను తానే నిర్వహిస్తానని అందులో ఆయన పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm