నవతెలంగాణ- ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16లో భాగంగా జైపూర్ లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో రాజస్థాన్ రాయల్స్ జట్టు తలపడనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తాము మొదట బ్యాటింగ్ చేయనున్నాట్లు రాయల్ ఛాలెంజర్స్ కెప్టెన్ ఫాప్ డూప్లెసిస్ అన్నారు. పరిస్థితులకు అనుకూలంగా పిచ్ ఉండవచ్చు.. ఇది పొడి వికెట్ లాగా కనిపిస్తుంది.. మేం మరింత మెరుగ్గా ఆడాల్సిన అవసరం ఉందని డుప్లెసిస్ అన్నాడు. మా టీమ్ లో 3-4గురు కొత్త కుర్రాళ్ళను ప్రతి మ్యాచ్ లో ఆడిస్తున్నట్లు ఆర్సీబీ కెప్టెన్ అన్నారు. గెలుపోటములు ముఖ్యం, నెట్ రన్ రేట్ ఇప్పుడు మమల్ని ఇబ్బంది పెట్టే విషయం కాదు. హేజిల్‌వుడ్ స్థానంలో పార్నెల్, హసరంగా ప్లేస్ లో బ్రేస్‌వెల్ తిరిగి జట్టులోకి వస్తున్నారని ఆర్సీబీ సారథి డుప్లెసిస్ అన్నాడు.
తుది జట్లు :
రాజస్థాన్ రాయల్స్ : యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్, జో రూట్, ధృవ్ జురెల్, షిమ్రోన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, ఆడమ్ జంపా, సందీప్ శర్మ, ఆసిఫ్, యుజ్వేంద్ర చాహల్.
రాయల్ ఛాలెంజర్స్: విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్(సి), అనుజ్ రావత్, గ్లెన్ మాక్స్వెల్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్, మైకేల్ బ్రేస్‌వెల్, వేన్ పార్నెల్, కర్ణ్ శర్మ, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 14 May,2023 03:36PM